Facebook Twitter
నీరు

 

 

నీరు

 

 

నీరు

ఏటిలోని

గల గలలు

లేవని,రావని

తడి ఆరిన గొంతుక

తల్లడిల్లుతున్నది..!!

మనిషి ధరణిపై

దండయాత్ర చేస్తుంటే

తల్లి మనసు తల్లడిల్లి

కన్నీరు కారుస్తుంటే..!!

తల్లి కన్నీటితో దేహం

దాహం తీర్చుకుంటున్నాము

కదిలి పోయే కాలంలో

కలసిపోయే నీకు..!!

తల్లి గాయాల వేదనల

రోదనలు కనిపించవా..!!

నీరించిన భూమాతను

కాటేయకురా.....!!

గంగమ్మ గల గలలు

సాగానివ్వర......!!

అక్రమించకు వాగు-వంకలు,

చెరువు-కుంటలు..!!

ధరణి గంగతో నిండినప్పుడే

మనిషి జీవన ప్రయాణం

కొనసాగును కదా..!!

 

- జాని.తక్కెడశిల