Home » కవితలు » గాదిలి ఉగాది (పద్యకవిత)Facebook Twitter Google
గాదిలి ఉగాది (పద్యకవిత)

టోరీ ఉగాది కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కవిత 
గాదిలి ఉగాది (పద్యకవిత)

 

1) సీ" అత్తవారింటిలో అప్పుడే అడుగుమోపెడి క్రొత్త కోడలు పిల్లవోలె 
         నిగ్గుల సిగ్గుల మొగ్గయై మరుమల్లె బరువుతోడ తలెత్తు వధువువోలె 
         ఆంధ్రికి  "హోదా"ల అమృతంబునేపంచ పొలుపుగానే తెంచు మొహినివలె 
         సగటు మానవుని నెమ్మొగమందు విరిసిన మవ్వంపు జిరునవ్వుపువ్వువోలె
         రసము చిందింపనెత్తు కలంబువోలె హృదయమును దోచ సిద్ధమో ఉదయము వలే 
         అందములుమీఱ, అవనికానందమూర | వచ్చు " శ్రీ విళంబ్యబ్దమా ! "స్వాగతంబు " || 


2) సీ" లంచంబు పట్టు సొమ్మంచనంగ చెలంగె వెగటైనా  రుచితోడ వేపపూత 
         పొగరుగా కట్నమ్ము పుచ్చుకొన్న వరుండనా వెల్గె  వగరుతో మావిముక్క
         వడి హడావుడిని చేసెడు "మృగాళ్ళో" యనవరలె కారంబుతో పచ్చిమిర్చి 
         తలలోని నాల్కయై మెలగు నేటి పడంతియుల్ల మౌచువెలింగె బెల్లమోర!
         నాయకుని వోలె ఉప్పు కనంబడదుగ! చింతపండు నిరుద్యోగి జీవితంబె 
         పచ్చడిగ ఇచ్చు నీవిందు "బహుపసందు"; గాదిలి ఉగాది! రసవేది ! ఘనవినోది! || 


3) సీ" ముత్తైదువలెయైన మ్రోడులా? అవి - కావు వీరేశలింగంబు సౌరుగాని;   
         కమ్మని కోకిల గళరవమ్మటె? కాదు బాలమురళికృష్ణ వాణిగాని;
         రెప్పవిప్పిన పూలరేకటే? అది - కాదు బాపు గీసిన బొమ్మ రూపుగాని ;
         భావమాధుర్యంపు బరిమళంబటె? కాదు - అల కృష్ణశాస్త్రి గేయంబు గాని;
         అనగ నొప్పారె వాసంతహాసరేఖ వేదమై, శుకశారికానాదమలర   
         తెలుగు భారతికల్యాణలలిత వేదియనగ నామనియొప్పెనుగాదివేళ || 

రచన :-  డా||  రామడుగు వెంకటేశ్వర శర్మ గారు 


నా దేశం
Aug 14, 2019
మేలు
Aug 5, 2019
చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా
Aug 2, 2019
కొమ్మన కోయిలలు వరసన పాడితే
Jun 27, 2019
ఆశ (కవిత)
Jun 14, 2019
సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా.. పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌..
Apr 5, 2019
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను.
Apr 30, 2019
అమ్మ నుంచే మన అమ్మ భాష ఆటలతో ఆనందభాష్పాలు
Feb 20, 2019
నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో... ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో.........
Feb 13, 2019
నీ కనుపాపలోని ప్రతి స్వప్నం నా గురించే అనుకున్నా...
Feb 12, 2019
TeluguOne For Your Business
About TeluguOne