Home » ఈపేజీ మీకోసం »  దేవుడిచ్చిన తండ్రి!Facebook Twitter Google
దేవుడిచ్చిన తండ్రి!

దేవుడిచ్చిన తండ్రి!

 

 "ఈరోజు బ్రేక్ ఫాస్ట్ సర్వీస్ ఉంది , వస్తారా?"అడిగాడు ఉమేష్ , కొత్తగా ఆ కమ్యూనిటీలో  అద్దెకు దిగిన నవీన్ ను. నవీన్ అమేరికాలో చికాగోనగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగరీత్యా వచ్చాడు. 

తెలుగు వారూ, ఇండియన్సూ ఉన్న కమ్యూనిటీ వెతుక్కుని ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కమ్యూ నిటీ వారంతా వెల్కం చేస్తూ పార్టీ ఇచ్చారు.అప్పుడే పరిచయ మయ్యాడు ఉమేష్. తెలుగు వాడు , హైదరాబాదులో పుట్టి, చదివి ,ఉద్యోగరీత్యా పదేళ్ళనుంచీ అక్కడ ఉంటున్నాడు. ఇంకా చాలా మంది అక్కడ ఇండియన్సూ, తెలుగువారూ, తమిళియన్స్ , కేరళీయులూ, కన్నడీగులూ చాలా మందే ఉన్నారు.

ఆరోజు శుక్రవారం రాత్రి డిన్నరయ్యాక, కమ్యూనిటీలో చల్లగాలికి నడుస్తున్న నవీన్, సుజన లను చూసి అడిగాడు ఉమేష్."అదేంటి అన్నయ్యగారూ! ఇక్కడ బ్రేక్ ఫస్ట్ సర్వీసేంటీ!"అందిసుజన .
"ఔను నేనూ అదే అడగబోతున్నాను."అన్నాడు నవీన్. "ఇక్కడా హోం లెస్ పీపు ఉన్నారండీ!వారికి ఒక పెద్ద హాల్ ప్రభుత్వం ఇచ్చింది. అనేక సర్వీస్ ఆర్గ నై జేషన్స్ వారు వారికి బ్రేక్ ఫాస్, డిన్నర్ ఇస్తుంటారు.మేమూ సత్యసాయి  సంస్థ తరఫున నెలకో మారు బ్రేక్ ఫాస్ట్ , డిన్నర్ ఇస్తుంటాం. "అన్నాడు.  "ఇక్కడ వీళ్ళంతా వెజ్ కాదుకదా తినేది ఏం ఇస్తారూ?అంది సుజన.

ఆమెకు కొత్త విషయాలు తెల్సు కోవడం చాలా ఇష్టం. "ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బ్రడ్ టోస్ట్శ్ ఇస్తాం, ఛీజ్ తో. టీ,ఇంకా యాపిల్ జ్యూస్ వంటివి.డిన్నర్ కు పీజాలు, బర్గర్స్ , బ్రెడ్ , పాస్తా, వెజిటబుల్ రైస్ , ఫ్రూట్ సలాడ్, యాపిల్, ఆరంజ్ జ్యూస్ ఇస్తాం. కొన్ని అక్కడే వండుతాం. వేసవికాలంలో తక్కువగా అంటే సుమారుగా యాభైనుంచీ,అరవై వరకూ ఉంటారు, వింటర్ లో వందవరకూ ఉంటారు. మీరు వచ్చారంటే అన్నీ చూడవచ్చు. లాంగ్ వీకెండ్ కావటాన ఎప్పుడూ వచ్చే వలంటీర్స్ తగ్గారు.

మీకు సరదా ఐతే రండి. లేకపోతే ఫరవాలేదు."ఉమేష్ వివరంగా చెప్పాక , వారికీ వెళ్ళాలనిపించింది."అలాగే వస్తామండీ "అన్నారు దంపతు లిరువురూ. "ఉదయ్యాన్నే ఫోర్ తర్టీకి బయల్దేరాలి, ఒక గంట డ్రైవ్, డౌన్ టవున్ వెళ్ళాలి. తిరిగి వచ్చేసరికి ఎనిమిది కావచ్చు , నేను మిమ్మల్ని పికప్ చేస్తాను " అంటూ వివరం చెప్పి, గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు ఉమేష్. 

అక్కడ మొత్తం పదిమంది వరకూ వలంటీర్స్ ఉన్నారు. అందరికీ నవీన్ దంపతులను పరిచయం చేసాడు ఉమేష్. నవీన్, సుజన అందరితో కలిసి  గబగబా  కూరలు తరగడం, పండ్లు తరగడం బ్రెడ్ వేడి చేయడం అన్నీ చేసారు. అందరికీ సర్వ్ చేసే ముందు కిచెన్ లోనే బ్రహ్మార్పణం చెప్పారు. వరుసగా ట్రేల న్నీ తీసుకెళ్ళి టేబుల్స్ మీదపెట్టి వలెంటీర్సంతా వరుసగా ఒక్కో డిష్ వద్దా ఒక్కోరూ నిల్చుని ,లేన్లో వస్తున్నవారికంతా ప్లేట్స్ ఇస్తూ వారు కోరినవి వడ్డించ సాగారు. అంతా సుమారుగా యాభై మంది ఉన్నారు ఉమేష్ చెప్పినట్లే.  

ఒక వ్యక్తి ఒక టేబుల్ ముందు కూర్చుని లేచి రానేలేదు.పక్కనే కూర్చుని బ్రెడ్ తింటున్న మరో వ్యక్తి అమేరికన్ ఇంగ్లీష్ లో "వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ తెచ్చుకో "అని చెప్పాడు. ఐనా అతడుకదల్లేదు. ఉమేష్ , కూర్చుని తింటున్న వారందరికీ మారు వడ్డిస్తూ అతడికేసి చూస్తూ "ప్లీజ్ నవీన్ మీరెళ్ళి అతడికి ఒకప్లేట్ ఇచ్చి వస్తారా! రాలేని వారికిమేమే వెళ్ళి ఇస్తుంటాం. "అని చెప్ప గానే నవీన్ వెంటనే ఒక ప్లేట్ లో అన్నీ వడ్డించుకుని , అతడి దగ్గరకెళ్ళి " ప్లీజ్ టేకిట్ అండ్ ఈట్ "అంటూ, అతడి చేయి పట్టుకుని చేతికిప్లేట్  అందించాడు. అతడు తలపైకెత్తి చూసి "ఇట్స్ ఓకే.తినకపోతే కుక్క చావు చస్తానిక్కడే. భగవంతుడు ఇంకా ఎంత ఆయుష్షు పెట్టాడో! నాబతుకిలా ఐంది. "అని స్వగతంగా అనుకుంటున్నట్లు అంటూ  , ప్లేట్ తీసు కున్నాడు.

నవీన్ ఆశ్చర్యంగా  అతడి కేసి చూసి " మీరు తెలుగు వారా!ఇక్కడికెలా వచ్చారు!" అని అడిగాడు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.దానికతడు వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. అక్కడ ఆ హోం కంతా వలంటీర్  ఉంటూన్న జాన్ వచ్చి ఆంగ్లంలో" సర్ ! ఇతడు గత పదిరోజులుగానే ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడికి మీలాగా డిన్నర్ సర్వీస్ చేయను వచ్చిన తను వెళ్ళేప్పుడు ఇక్కడ వది లేసి, కారు ట్రబులైంది, రెడీ చేసుకుని వచ్చి తీసుకెళతానని చెప్పి  వెళ్ళాడు. మళ్ళీరాలేదు. ఇతడి కొడుకుట.ఆరోజునుంచీ ఇంతే తినడు, ఏమీత్రాగడు, మేమే బలవంతంగా పెడుతుంటాం. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు. " అని చెప్పాడు. 

"సర్ !  మీపేరేంటీ! మీకొడుకు ఇక్కడ వదిలేసి పోయాడా! ఎందుకూ! ఇదినిజమేనా!  "అని అడగ్గానే అతడి ఏడుపు మరింత పెరిగింది."సర్ ! మీరు ఏదైనా చెప్తే మేమేమన్నా సాయం చేయగలమేమో చూస్తాం సర్. మీరు ఇండియా వెళ్ళాలన్నా సాయం చేస్తాం" అన్నాడు. ఆమాట వినగానే అతడు లేచి నవీన్ పాదాలపై బడి "ఆసాయం చేసి పెట్టు నాయనా!"అంటూ ఏడ్వ సాగాడు. నవీన్ ఉమేష్ తో అరడి విషయం మాట్లాడ్గా"నవీన్ ! అతడేవరో ఏమో ఏమీతెలీకుండా ఇంట్లో పెట్టు కోడం మంచిదేనా , మీ మిసెస్ తో మాట్లాడండి ముందుగా "అన్నాడు నవీన్ సుమనతో మాట్లాడాడు "ఎందుకో అతడిని చూస్తుంటే బాగా తెలిసిన వాడిలా ఉన్నాడు, అతడి బాధ చూడలేకున్నాను.

హోం వలెంటీర్ మాటలు వింటుంటే ఇక్కడ ఉంటే ఎంతో కాలం బ్రతికేలాలేడు. అతడు ముసలి వాడు మమ్ము లనేం చేస్తాడు. చూద్దాం ఉమేష్! అతడితో అన్నీ మాట్లాడాక మనకు సాధ్యంకాక పోతే తిరిగి ఇక్కడే వదు లుదాం."అంటూ , హోం వలెంటీర్ తో చెప్పి, వచ్చేప్పుడు అతడ్ని తనతో తన ఇంటికి తెచ్చాడు. అతడి వద్ద హోం వారిచ్చిన ఒక జత బట్టలు తప్ప ఏమీలేవు. అతడు అవితెచ్చుకుంటుంటే నవీన్ వద్దని చెప్పాడు.

ఇంటికొచ్చాక అతడిని స్నానం చేయమని, తన తువ్వాలూ,పంచె బనియన్ ఇచ్చి, షేవ్ చేసుకోమని అన్నీ ఏర్పాటు చేశాడు.చక్కగా స్నానం చేసి వచ్చాక అతడ్ని గుర్తిచి  నవీన్ ఆశ్చర్యపడ్డాడు. "సర్ మీరు మీరు మధవరావు గారుసార్ కదూ! మా మాస్టర్ , మాకు బ్రతుకు నేర్పిన మాస్టర్!" అంటూండగా ఆయన "అవును బాబూ మాధవరావునే ! నీవు .." "నేను నవీన్ను మాస్టారూ !మీరు రోడ్డుమీద కనిపించిన నన్ను తెచ్చి బళ్ళో వేసి చదివించి, ఆ తర్వాత హాస్టల్లో వేశారు. అప్పుడప్పుడూ వచ్చి చూసేవారు.

ఐఐటీ ట్రివెండ్రం లో చదువయ్యాక మీకోసం వస్తే మీరు రిటైరయ్యాక ఎక్కడున్నారో తెలీ దని చెప్పారు.ఎవ్వరూ మీ చిరునామా కూడా చెప్పలేక పోయా రు. నా వివాహం సందర్భంలో కూడా మీకోసం చాలా ప్రయత్నించాను. ఈమే నా భార్య సుజన . నేను ఉద్యోగరీత్యా తిరుగుతూ ఇటీవలే ఇక్కడి కొచ్చాను. అసలేమైంది మాస్టారూ!" అని ప్రేమగా అడుగు తున్న నవీన్ ను ఆలింగనం చేసుకుని చాలా సేపు ఏడ్చాడాయన.కొద్దిసేపయ్యాక ంతేరుకుని,మెల్లిగా మాట్లాడ సాగాడు. 

"బాబూ ! నవీన్! నీలాగే ఎందరికో చదువు చెప్తూ బతికిన నాకు ఒక దురదృష్టపు క్షణాన నీలాగే వాడినీ,ఒక అనాధ శరణాలయంలో చూసి, మాకూ పిల్లలు లేనందున దత్తత తీసుకున్నాం.చదువు చెప్పించి,అమేరికా వెళతానంటే మా ఆస్థతా కరిగించి డాలర్స్ చేసి పంపాం. నాభార్య నేను రిటైరయ్యాక గతించింది. అక్కడే ఉండే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానన్నాడు. చేసుకున్నాడు కూడా ఆపాటికే. నా మా స్వగ్రామంలో ఉన్న ఐదెకరాల పొలం విలువ కోట్లలోకి రాగానే , దాన్ని అమ్ముదామన్నాడు. నేను అంగీ కరించలేదు. కొద్దికాలమయ్యాక అమేరికా చూద్దువుగానిరా అనిపిలిచి అన్నీ ఏర్పాటు చేసి, తెచ్చాడు. పదిరోజులు బాగానే చూసుకున్నాడు. 

మీలాగే ఏదోక్లబ్ వారు డిన్నర్  సర్వీస్ అని వాళ్లతో పాటుగా వచ్చీ, వెళ్లేముందు,"నాన్నా! కారు రిపేరు వచ్చింది, ఒక్క గంటలో వస్తాను ఇక్కడే ఉండు "అనిచెప్పి వెళ్లాడు.ఇహరానే లేను. ఆ పొలం కోటల కోసం నన్నిక్కడ వదిలేసి ఉంతాడు. అనాధను దత్తత తీసుకుని అనాధనై ఆ హోం లెస్ వారితో కలసి పోయాను బాబూ! నిన్ను భగవంతుడే పంపాడు "అంటూ భోరున ఏడ్వసాగాడు మళ్ళీ. "మాస్టారూ ! ఏడ్వకండి, చూడలేము. ఆభగవంతుడు మిమ్ము చూడనే మమ్మల్ని అక్కడికి పంపాడు.

మొదటి మారు రావడం మిమ్ము తిరిగి కలవనే మాస్టారూ!.  ఏమీ భయపడకండి. ఇక్కడి మా స్నేహితులతో మాట్లాడి ,సాయం తీసుకుని అతడెక్కడున్నా పట్టుకుందాం, మీపొల అమ్ముకోకుందా చేయగలం. మీరు మాకిక్కడ దేవుడిచ్చిన తండ్రి. మాదగ్గరే ఉండండి."అంటూ దంపతు లిద్దరూ ఆయన పాదాలకు నమస్కరించారు.  

-రచన---అదూరి.హైమావతి.

తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని
Feb 12, 2018
01 - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలని ద్రవిడ భాషలంటారు కదా!
Dec 16, 2017
తేనెటీగా! తేనెటీగా!  తేనె ఇస్తావా? 
Dec 2, 2017
దివిటీల పండుగ టపాసుల పండుగ లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ
Oct 14, 2017
అతడు-ఆమె-ఆకాశం
Oct 10, 2017
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ
Sep 29, 2017
సర్వాయి పాపన్న కథ వింటారా
Sep 28, 2017
తెలుగునాట అమ్మవారి దసరా ఎంత వేడుకగా
Sep 27, 2017
ద‌స‌రా వ‌చ్చేసింది. ఎటుచూసినా అమ్మ‌వారి కొలుపులే క‌నిపిస్తున్నాయి.
Sep 25, 2017
ఇప్పుడంటే గురువులకి తగినంత జీతం దక్కుతోంది.
Sep 22, 2017
TeluguOne For Your Business
About TeluguOne