Facebook Twitter
జ్ఞాపకానికి మరణం లేదు..

జ్ఞాపకానికి మరణం లేదు

చికటి రాజ్జపు చిట్టడివిలో
అంతటా నిశ్సబ్దం
ఈ క్షణమే తట్టుకోలేకుంటే
మబ్బుతునకల ఆఖరి చారికను
అదృశ్యం చేస్తూ
చికటి కమ్మేసి
విలయతాండవం ఆడుతుంటే
ఇక ఈ రాత్రిని భరించటం ఎలా-----

ఇంత విషాదపు స్పర్స
మునుపెన్నడూ స్ప్రుసించలేదే
పేగుల్ని మెలిపెట్టేసి
గుండెని పిండేసి
భయానక నుత్యం భ్రమింపజేసే
ఈ ఒక్క క్షణం కాసేపు స్రుష్టిని ఒడిసి పెడితే సంబరమే||
చివరి మజలి ఇంత కఠినమా----

కరుణా రాహిత్యమై
కన్నీరు మున్నీరు రోదనై
యమదండయాత్ర దిక్కరించలేని
కళ్ళల్లో ఇంత దురవస్థ
చూపుల్లో ఇంత అచేతనం
ఎన్నడూ దరిచేరలేదే!!

మానవ జన్మ
వీట్కోలు పలుకుతుంటే
దేహం విలవిల
సృష్టికర్తకి అర్ధం కాలేదా?
ఏమీచేయలేని అశక్తత
చేతుల్ని కట్టిపడేసిన
ఆ క్షణం బహుశా దురదృష్టానికి ప్రతీక!

తుది శ్వాస ఓ చేదునిజం
నిశ్చల భయాల నిర్వికార స్వప్నమై
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికైపోతే----

నిర్జీవం జీవమై
నాన్న సజీవమై
ఎప్పటికి సజీవమై
కళ్లు తెరచి
అదే చిరునవ్వుతో -----!

అదే పంచెకట్టు
అదే తుండువా
అదే ఠీవీ
భౌతికానికే మరణం
జ్ఞాపకానికి మరణం లేదు/రాదు

భగవంతుని చేరుకున్న వారందరికి నా కవిత అంకితం..

-Manohara Kummaragunta