Facebook Twitter
ఆమని వెన్నెలలు

ఆమని  వెన్నెలలు

 

ఆమని  వెన్నెల  మీటితే  అది ఏ రాగం

కొమ్మన  కోయిలలు వరసన  పాడితే అది  ఏ  రాగం

మల్లెలు ఒకటిగా  కూర్చితే  అది ఏ రాగం

జాజులు  తీగల  అల్లుకుంటే  అది ఏ రాగం

మకరంధం మందారం  ఒకటైతే  అది ఏ రాగం

ఆడపిల్ల  పట్టూ ,పావడా కట్టుకుంటే అది ఏ రాగం

ఆ---ఆ---- ఆ---ఆ---ఆ---ఆ---!

ఆమని  వెన్నెల  మీటితే  అది ఏ రాగం .......!

నెయ్యి  తేనె కలగలిసిపోతే అది ఏ రాగం.

పసుపు, కుంకుమ   పక్కన  పెడితే అది ఏ రాగం.

ఆకు, వక్క తాంబూలము చుడితే  అది ఏ రాగం

ఆమని  వెన్నెల  మీటితే  అది ఏ రాగం

కొమ్మన  కోయిలలు వరసన  పాడితే అది  ఏ  రాగం

మల్లెలు ఒకటిగా ఒకటిగా కూర్చితే  అది ఏ రాగం.||

 

- మనోహర బోగా