Facebook Twitter
మౌనం

 

మౌనం

 

 

 

తెలిసిపోతుంది
నిజమైన కొన్ని ప్రశ్నలకు
తికమకల్లో నిన్నుంచిన సమాధానాలకు
అవకతవకల ఆప్యాయతల అబద్ధాలను
తిప్పికొట్టే "ఆయుధమే" అదని!

అదను చూసి
కదం తొక్కే పరిహాసాల
పరంజాలను కూల్చి
నిన్ను నీలోకి చూపే
నీదైన స్వార్ధమే ఇదని!

జ్ఞాపకాల అజీర్తికి
అసలైన ఔషధమని
ఔననీ,కాదనీ చెప్పక
దోబూచులాడినా...

పరిచయాల మాటున
చీకటి,వెలుగుల వర్తమానాన్ని
దాహార్తి తీరేలా
నువ్వు తాగే రేయిలో..

నిలబడి
కలబడి
నిలుస్తుందో 'పదం'
నాకై నన్నాదరించిన
మౌనమనే అద్భుతం!

మౌనమే దివ్యౌషధం...
కాలం చేసిన గాయాలకు
రేయి పగటితో తీసిన ఈ రాగాలకు
నే ఓలలాడుతున్న నీ గారాలకు!!

- Raghu Alla