ఆశ (కవిత)
ఆశ (కవిత)
పున్నాగ పూల పరిమళంలా ఎదురవుతావు
తెలిమంచులా నిన్ను అతుక్కుపోతాను
తొలిసంధ్యతో వికసిద్దామని ఎదురుచూస్తూ నువ్వు
అవే ఆఖరి క్షణాలని కృంగిపోతూ నేను
దిగులు కొయ్యపై ఆరని పచ్చి భావాలుగా నేను
ఆత్మీయత ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు మండిస్తూ
మనసుకొయ్యను సైతం దహించివేసే ఉత్ర్పేరకం నువ్వు
దూరపు కొండల్లా దగ్గరే ఉన్నట్టుండే దూరాలమో
దగ్గరే ఉన్నా దూరమవుతున్న రెండు విరహాలమో
కానీ ఇద్దరి గమ్యం ఒక్కటే
రేపు పొడిచే తొలిపొద్దు కోసం
మళ్ళీ వికసించే నవ్వుల కోసం
ప్రతీ దినం అదే ఆశ
ఇది చాలేమో జీవించటానికి
- సరిత భూపతి
సంస్కృతి, సంప్రదాయం సందడిచేసేలా..
పసుపు, కుంకుమ పల్లవి పాడిన శుభవేళ..
Apr 5, 2019
నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో...
ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో.........
Feb 13, 2019