Facebook Twitter
ఒక్కసారి ఆలోచించు

ఒక్కసారి ఆలోచించు

 

 


"ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది
కాని చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు"
ఇది తెలిస్తే నీకు చావాలన్న ఆలోచన రాదు..
నీకే కాదు, ప్రతి మనిషికి సమస్యలుంటాయి
చేతనైతే పోరాడు లేదా పరుగెత్తు
అంతేగాని ప్రాణాలు మాత్రం తీసుకోకు..
బ్రతికుంటే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది
చనిపోతే నీ వాళ్ళకి కన్నీళ్ళు తెప్పించడం తప్ప నువ్వేం సాధించలేవు..
నీ చావుకి కారణం కొన్ని క్షణాలైతే
నీ చావు విలువ నీ వాళ్ళ కన్నీళ్ళు
నీకు చావాలన్న ఆలోచన వచ్చినప్పుడు 
నీ వాళ్ళ కన్నీళ్ళు గుర్తుతెచ్చుకో 
నీకు బ్రతకాలన్న ఆశ పుడుతుంది..
అసలు నీ సమస్యే నీ వాళ్ళైతే 
వాళ్ళకి దూరంగా నీకు నచ్చినట్టు బ్రతుకు
అంతేగాని శాశ్వతంగా దూరమవ్వకు..
చివరగా ఒక్క మాట
"నీకేదైనా సమస్య వస్తే
చావుని వెతుక్కుంటూ వెళ్ళకు
సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళు"...

- గంగసాని