Home » పిల్లల కోసం » పెద్దచింతచెట్టు... చిన్న చింతచెట్టుFacebook Twitter Google
పెద్దచింతచెట్టు... చిన్న చింతచెట్టు

పెద్దచింతచెట్టు... చిన్న చింతచెట్టు

 

 


ఒక అడవిలో రెండు చింత చెట్లు ఉండేవి. ఒకటేమో పెద్దది. ఇంకొకటేమో చిన్నది. ఒకరోజు ఆ అడవికి ఒక కాకి వచ్చింది, తన పిల్లలతో బాటు. అవి గూడు కట్టుకొనడానికి ఒక చెట్టు కావాలి. పెద్ద చింత చెట్టును చూసి 'ఇదైతే మనకు బాగుంటుంద'ని అనుకున్నాయవి. అప్పుడు అమ్మ కాకి దాని దగ్గరకు వెళ్ళి, "బావా! బావా! నీకొమ్మ ల మీద మేము ఇల్లు కట్టుకుందుమా?" అని అడిగింది. దానికి ఆ చింతచెట్టు, "ఏయ్! ఏమనుకున్నారు నేనంటే! నీలాంటోళ్ళా నా మీద ఇల్లు కట్టుకునేది! పోతారా, లేదా!?" అని గట్టిగా కసురుకుంది. ఆ అరుపుకి భయపడి అక్కడ్నించి వెళ్ళిపోయాయి అవి.

తరువాత అవి చిన్న చింతచెట్టు దగ్గరకు వెళ్ళి, "బావా! బావా! నీ చిన్ని చిన్ని కొమ్మల్లో మేము ఇల్లుకట్టుకుందుమా?" అని అడిగాయి. చిన్న చింతచెట్టు సంతోషంగా, "దానిదేముంది, వచ్చి నా కొమ్మల్లో మీకు ఇష్టమొచ్చినట్లు ఇల్లు కట్టుకోండి. నాకూ మీ తోడు బాగుంటుంది" అనింది.

కాకులు భలే సంతోషపడ్డాయి. అక్కడక్కడా ఉన్న ఎండు పుల్లల్ని ఏరి తెచ్చి కాకులు చిన్న చింత చెట్టులో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాయి. నిదానంగా కాకులు చాలా అయినాయి. అన్నీ సంతోషంగా బతుకుతున్నాయి. ఇప్పుడు చెట్టు నిండా చాలా కాపురాలయినాయి. కాకుల సందడితో చిన్న చింతచెట్టూ సంతోషంగా ఉంది.

 

 

ఒకరోజు చింతాకు కోసమని పక్కూరు నుండి చాలా మంది మనుషులు ఆ అడవికి వచ్చారు. వాళ్ళకి మొదట చిన్న చింతమాను కనబడింది. దాని మీది చింతాకు వాళ్ళకు బాగా నచ్చింది. కానీ దాని మీదున్న కాకుల్ని చూసి, "అయ్యో! దీని చింతాకు మనకొద్దు. దీని మీద ఎన్ని కాకులున్నాయో! అవి మనల్ని పొడుస్తాయి, ఇక్కడ వద్దు," అని ఆ మనుషులు అలా పోతూ ఉంటే వాళ్ళకు పెద్ద చింతచెట్టు కనబడింది. దానిలో కూడా‌ చింతచిగురు చాలా బాగా కాసి ఉంది. కానీ చిన్నచెట్టు మీదలాగా దీని మీద కాకులు లేవు! అంతే! మనుషులంతా దానిమీద పడి, ఆ చెట్టు మీద ఉన్న చింతాకు మొత్తం పీక్కెళ్ళి పోయినారు.

ఆకులన్నీ పోగొట్టుకొని, విరిగిపోయిన కొమ్మలు రెమ్మలతో బాగా ఏడ్చుకున్నాక, పెద్ద చింతచెట్టుకు బుద్ధి వచ్చింది. అప్పటినుండీ అది అందరినీ ఆహ్వానించటం, అందరినీ కలుపుకు పోవటం నేర్చుకున్నది.

Courtesy..
kottapalli.in

కాకీ కాకీ రావా
Feb 22, 2018
అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పావురం ఉండేవి. పావురమేమో నీలంగా ఆకాశం రంగులో మెరుస్తూ ఉండేది.
Feb 12, 2018
ఒక మేకల కాపరికి చాలా మేకలున్నాయి. అతను రోజూ ఆ మేకలన్నిటినీ అడవికి తీసుకెళ్తూ ఉండేవాడు. 
Feb 8, 2018
ఒక చేతిలో కర్ర, మరో చేత సంచీ పట్టుకొని ఒక మనిషి అడవిలోకి ప్రవేశించాడు. అటూ యిటూ చూస్తూ, పాటలు పాడుకొంటూ పోతున్నాడు.
Jan 24, 2018
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా అల్లరి కోతి. అది ఒక రోజు మామిడి చెట్టు ఎక్కింది.
Jan 22, 2018
ఒక ఊళ్లో రైస్‌మిల్లు ఒకటి ఉండేది. ఆ ప్రాంతాల్లోనే ఒక పిచ్చుకల జంట ఉండేది. రైస్‌మిల్లు బయటివైపున చూరులో గూడు చేసుకున్నాయవి.
Jan 19, 2018
అనగా అనగా ఇంగ్లండులో ఒక అవ్వ, తాత, వాళ్లకో చిన్ని మనవడు ఉండేవాళ్ళు.
Jan 16, 2018
రాము తన స్నేహితులతో బంతి ఆట ఆడుతున్నాడు.  ఇంతలో బంతి ఎగురుకుంటూ పోయి ఒక చెట్టు తొర్రలో పడింది.
Jan 12, 2018
నేనొక సూపర్‌ మ్యాన్‌ని. ఎగరగలుగుతాను. ఎటు కోరితే అటు వెళ్ల గల్గుతాను. దూరదూరాల్లో ఏం జరుగుతున్నదీ‌ కూడా నాకు కనిపిస్తుంది.
Jan 11, 2018
అనగనగా ఒక ఊరిలో ఒక రంగయ్య ఉండేవాడు. ఒకసారి ఆ రంగయ్యకు ఓ పెద్దాయన ఓ కేలెండర్ ఇచ్చారు.
Jan 9, 2018
TeluguOne For Your Business
About TeluguOne