Home » కథలు » చేసిన మేలుFacebook Twitter Google
చేసిన మేలు

చేసిన మేలు

 

 

అనగనగా ఒక అడవిలో ఒక కాకి, ఒక కోయిల ఉండేవి. అడవిలోని ఒక వృక్షం మీద వాటి నివాసం ఉండేది. ఒకరోజున వాటికి చాలా ఆకలైంది. ఆహారం కోసం అడవి అంతా గాలించాయి. ఎంత వెతికినా తినేందుకు ఏమీ దొరకలేదు. తిరిగి తిరిగి పాపం, అవి బాగా అలసిపోయాయి కూడా. దాహంతో వాటి నోరు పిడచబారింది. "ఇక లాభం లేదు- ఈ పూటకు నీటితోటే కడుపు నింపుకుందాం!' అని అనుకునే సరికి అవి అడవిని దాటి జనావాసాలను చేరుకొనేసాయి! అది మండు వేసవి. 

 

ఊరిలో కూడా ఏ మూలనా నీటి జాడ లేదు. మనుషులుండే గుడిసెలలోకి పోయి వెతికేంత చొరవ వీటికి లేదు! ఆ సరికి అవి రెండూ చాలా అలసి పోయాయి. అంతలో కొంత దూరాన మంచి చేను ఒకటి కనబడింది.  రెండూ ఆ చేనును చేరుకునేసరికి కోయిల మరింత నీరసించింది. ఇక దానికి అడుగు తీసి అడుగు వేసేంత బలం కూడా లేదు. ఉండిన చోటనే కూలబడిపోయింది. 

 

కాకి ఒంటరిగా చేనులోకి పోయింది. చేనులో దూది విరగకాసి ఉండింది. కానీ‌ నీరు ఏ మూలనా పారటం లేదు- బిందు విధానం వలన! అయితే బోరుబావి కాడ నీరు కొంచెం కొంచెంగా కారుతూ ఉండింది!  కాకి ఆ తావును చేరి, తాను గబగబా కాసంత నీరు తాగేసి కడుపు నింపుకుంది. 'మరి కోయిలకు నీరు తీసుకొని పోయేది ఎలాగ?' అని ఆలోచించింది. అంతలో దాని చూపు దూది మీద పడింది. గబగబా పోయి, కొంత దూదిని సేకరించి, దానిని నీటిలో తడిపింది. తడి దూదితో ఎగిరి కోయిలను చేరింది. కోయిల మన సోయిలో లేదు. 

 

కాకి తడి దూదిని దాని ముఖం మీద వేసి పిండింది. ఇలా రెండు మూడు తడవలు అటూ ఇటూ తిరిగి, తడి దూదిని తీసుకొని పోయి వేసే సరికి, ఆ తేమకు కోయిల కొంచెం కదిలింది. కోయిల కనులు తెరిచేసరికి కాకికి చాలా సంతోషం వేసింది. అది ఇంకో మూడు వరుసలు తిరిగి మరింత తడి దూదిని తీసుకుపోయింది.

 

అమృతం లాంటి ఆ నీటి బిందువుల వలన కోయిల తేరుకొనింది. సంతోషంతో వాటికి సగం బలం సమకూరింది. ఇక అవి నిదానంతా చేనులోని బోరుబావిని చేరుకొని, కడుపులు నింపుకుని, కొంత సేపు సేద తీరాయి. చేనులో‌ కాకికి తొండ లాంటిది ఒకటి దొరికింది కూడా. తనకు దొరికిన తిండిని అది కోయిలతో కూడా పంచుకొనింది. 

 


సాయంకాలం అవుతుండగా కాకి, కోయిల రెండూ తిరిగి కాసిని నీరు తాగి, వెనుకకు మరలాయి. 'కలసి ఉండటం వలననే కదా, ఇవి తిరిగి రాగలిగింది?' అని అడవిలోని పక్షులు సంబరపడినాయి. 'కాకులు ఎలాగైనా చాలా తెలివైనవి' అని అభినందించాయి. 'ఇకమీద చాలా దూరాలు ఎగరకండి' అని తమ కూనలకు బోధించాయి. 

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి...
Jun 26, 2020
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు....
Feb 8, 2020
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Oct 30, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
TeluguOne For Your Business
About TeluguOne