Facebook Twitter
చేజిక్కిన బంతి

చేజిక్కిన బంతి

 


రాము తన స్నేహితులతో బంతి ఆట ఆడుతున్నాడు. 
ఇంతలో బంతి ఎగురుకుంటూ పోయి ఒక చెట్టు తొర్రలో పడింది.


పిల్లలు బంతి కోసం చెట్టు తొర్రలో చేతులు పెట్టారు. 
వాళ్లందరినీ చీమలు కుట్టాయి. బంతి మాత్రం దొరకలేదు. 

 


అంతలో రాముకి ఓ మంచి ఆలోచన వచ్చింది. 
బిందెతో నీళ్ళు తీసుకొచ్చి తొర్రలో పోశాడు. 

 


బంతి నీళ్లమీద తేలుకుంటూ పైకి వచ్చింది! 
పిల్లలంతా రాము తెలివిని మెచ్చుకున్నారు. 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో