Home » Enki Patalu » రావొద్దె! - నండూరి సుబ్బారావు
రా వొద్దె!
రావొద్దె నా పక్క రావొద్దె యెంకీ !
ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ!
నీ మీద పాణాలు నిలుపుకొంటా వచ్చి,
అద్ద రేతిర్లోనె అడివంత తిరిగానె !!
రావొద్దె నా పక్క రావొద్దె యెంకీ !
ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ!
గట్టెక్కి సూసాను ! పుట్టెక్కి సూసానె !
కల్ల కపటము లేని పిల్లవను కున్నానె !!
రావొద్దె నా పక్క రావొద్దె యెంకీ !
ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ!
యేడ నువ్వుండావొ యేళ్ళన్ని యీదానె !!
యేటి సేస్తుండావొ యీశ్శరుణ్ణడిగానె !!
రావొద్దె నా పక్క రావొద్దె యెంకీ !
ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ!










