యమ్మి యమ్మి మాంగో జామ్

 

 

జామ్ పేరు వినగానే నోట్లో నీళ్ళు చేరతాయి. కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఉండే జామ్ బ్రెడ్ పైనే కాదు ఉత్తిది తినమన్నా రెడీ అయిపోతారు పిల్లలు. పిల్లలకి నచ్చే మాంగో జామ్ మనం ఇంట్లోనే తయారుచేసి పెడితే వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తయారుచేసుకునే మాంగో జామ్ తయారి విధానం ఎలాగో చూసేద్దామా.

 

కావాల్సిన పదార్థాలు:

పండిన మామిడి గుజ్జు - 1 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
నిమ్మరసం - 1 చెంచా

 

తయారి విధానం:

ఈ జామ్ తయారి కోసం ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో మామిడి గుజ్జు, పంచదార, నిమ్మరసం ఈ మూడింటిని వేసి కలిపి స్టవ్ మీద సిమ్ లో పెట్టి ఉంచాలి. అలా దానిని తిప్పుతూ ఉంటే కొంతసేపటికి అది దగ్గర పడుతుంది. ఒక పావుగంట సేపు అలా ఉంచాకా మొత్తం దగ్గరపడి జామ్ షేప్ లో కనిపించాకా స్టవ్ ఆపి దానిని చల్లారనిచ్చి  ఎయిర్ టైట్నర్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుకోవాలి. అంటే తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో  తయారుచేసుకునే మాంగో జామ్ రెడీ అయినట్టే. ఇక పిల్లలకి పరుచి చూపించి వాళ్ళ మోహంలో ఆనందం చూసి మనం కూడా ఆనందించటమే.

- కళ్యాణి