Home >>Vegetarian >>Usiri Rice (Karthika Masam Special)

 

 

ఉసిరిరైస్ (కార్తీకమాసం స్పెషల్)

 

 

కావలసినవి :

ఉసిరికాయలు      - 8 

పర్చిమిర్చి          - 4 

కొత్తిమీర             - 2  కట్టలు 

జీలకర్ర               - 1/2 స్పూన్ 

నిమ్మకాయ         - 1

పసుపు              - 1  స్పూన్ 

ఉప్పు                  - 1  స్పూన్ 

బియ్యం              - 1 గ్లాస్ 

నూనె                 - 1/4 కప్పు 

పోపు సామగ్రి       - ఎండుమిర్చి, శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు 

జీడిపప్పు             - 10 

ఇంగువ               - కొద్దిగా 

తయారుచేసేవిధానం :

* ముందుగా ముక్కలుగా తరిగిన పెద్ద ఉసిరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ముందుగా నూరుకుని.... నిమ్మరసంలో నానబెట్టుకోవాలి. 

* 1 గ్లాసుకు 2 గ్లాసు నీరు కొలతగా కొద్ది ఉప్పు, పసుపు వేసి అన్నం వండుకోవాలి.

* స్టౌవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి ఇంగువ, పోపు దినుసులు వేయించుకుని చివరగా జీడిపప్పు వేసి స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి. 

* వేడి అన్నం మద్యలో గుంటగా చేసి ఉసిరి ముద్దని వేసి మూసివేసి 10 ని " తరువాత పోపువేసి పులిహోర మాదిరి కలుపుకోవాలి. చాలా రుచిగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరిరైస్ చాలా బావుంటుంది.   

 

 

..Bharati

Related Recipes