టమాటా బాత్

స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేయాలి, అది వేడయ్యాక అందులో జిలకర, ఉల్లిగడ్డలు వేసి వేయించాలి. తరవాత అందులో టమాటా వేయాలి. అది వేగాక ధనియాల పౌడర్, జిలకర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు, మూడు నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తరవాత అందులో తగినంత కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ తరవాత కడిగిన బియ్యాన్ని వేసి ఒక కప్పు బియ్యానికి 11/2 వంతు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పూర్తిగా దగ్గరయ్యాక దించి జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుంది.  

 

స్వీట్ అరటికాయలు

 

ముందుగా మైదా ఉండల్లేకుండా నానబెట్టుకోవాలి, ఆ తరవాత ఒక కప్పు మైదాకు , 11/2 కప్పు చక్కర తో పాకం చేసుకోవాలి. పాకం వచ్చేంతవరకు మైదా పిండిని పూరీల్లా చేసుని వీడియోలో చూపిన విధంగా అంచుల్ని కాక పూరీ మధ్యలో నిలువుగా కోయాలి. ఆ తరవాత అంచుల్ని పట్టి జాగ్రత్తగా అరటికాయల్లా మలచి పెట్టుకోవాలి.

ఇంకో బాణలి లో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి. అది కాగాక అరటికాయల్లా కోసి పెట్టుకున్న పూరీలను నూనె లో ఫ్రై చేయాలి. ఆ తరవాత ఫ్రై అయిన అరటికాయలను పాకంలో ముంచి తీయాలి. అంతే స్వీట్ అరటికాయలు రెడీ.

గమనిక : మైదా పిండిని నానబెట్టేటప్పుడు కొద్దిగా వేడి నూనె కూడా వేస్తే మైదా అరటికాయలు క్రిస్పీ గా ఉంటాయి.