టేస్టీ మటన్‌ పలావ్‌

 

 

 

 

కావాల్సినవి :
మటన్  : అర కిలో
బియ్యం : అర కిలో
యాలకులు : 5 గ్రాములు
గరం మసాల : 1 టేబుల్‌ స్పూన్‌
పలావు ఆకులు : రెండు
యాలకుల పొడి : ఒక స్పూన్‌
పెరుగు : అరకప్పు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 4  టేబుల్‌ స్పూన్స్‌,
పచ్చి మిర్చి : నాలుగు,
ధనియాల పొడి : 2 టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయలు : 3 
ఉప్పు : సరిపడా
మిరియాలు : ఒక స్పూన్‌
కొత్తిమీర : ఒక కట్ట

 

తయారీ :
ముందుగా బియ్యం కడిగి అరగంట ముందు నానపెట్టుకోవాలి. మటన్‌ను శుభ్రంగా కడిగి  పక్కకు పెట్టుకోవాలి.  తరువాత పాన్‌ తీసుకని స్టవ్‌ మీద పెట్టి 2 టేబుల్‌ స్పూన్స్‌ నెయ్యి వేయాలి. అందులో అల్లం పేస్ట్ సగం, ఉల్లిపాయ ముక్కలు సగం, ఉప్పు  వేసి వేయించాలి. ఇప్పుడు  మటన్‌ ముక్కలను వేసి మూడు గ్లాసుల నీటిని పోసి ఉడికించాలి. ఇప్పుడు ఉడుకుతున్న మటన్ లో యాలకులు, లవంగాలు, మిరియాలు, పలావు ఆకులు  వేసేయాలి. మటన్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ లోంచి  మటన్‌ ముక్కల్ని విడిగా తీసేయాలి. స్టవ్ మీద మరో పాన్‌ను పెట్టి మిగిలిన నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు , అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి వేయించాలి. కొంచెం వేగాక ఉడికించిన మటన్‌ ముక్కలు వేయాలి. తరువాత ధనియాల పొడి పచ్చిమిర్చి వేసి చిన్న మంట పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నానపెట్టుకున్న  బియ్యం, యాలకుల పొడి, గరం సరిపడా  నీళ్ళు  పోసి  కర్రీ  గ్రేవీ వేసుకుని మూతపెట్టాలి. పలావ్ ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి..