Facebook Twitter Google

Home >>Sweets N Deserts >>Sweet Carrot Crackers

 

 

 

స్వీట్ క్యారెట్ క్రాకర్స్

 

 

కావలసిన పదార్థాలు:

క్యారెట్ తురుము                                    - ఒకటిన్నర కప్పు
చక్కెర                                                   - ముప్పావు కప్పు
మైదాపిండి                                            - ఒక కప్పు
నీళ్లు                                                      - అరకప్పు
చీజ్ తురుము                                       - అరకప్పు
కోడిగుడ్లు                                               - రెండు

 

తయారీ విధానం:

* క్యారెట్ తురుములో నీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. క్యారెట్ బాగా ఉడికిన తరువాత నీటిని ఒంపేసి క్యారెట్ తురుముని ఆరబెట్టాలి.

* చల్లారిన తరువాత క్యారెట్, కోడిగుడ్డు సొన, చీజ్, చక్కెర కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

* దీన్ని ఓ బౌల్ లోకి తీసుకుని, కొద్దికొద్దిగా మైదాపిండి వేసి కలుపుతూ ఉండాలి.

* చపాతీ పిండిలా అయ్యేవరకూ బాగా కలుపుకుని పక్కన పెట్టేయాలి.

* అరగంట తరువాత కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని, ఉండలు చేసుకుని, చపాతీల్లా ఒత్తాలి.

* వీటిని నాలుగు వైపులా చాకుతో కోసేసి, ఆ తరువాత ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి.

* మైక్రో అవన్ ఉన్నవాళ్లు 350 డిగ్రీల వద్ద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అవన్ లేకపోతే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.


- Sameera

Other Sweets N Deserts Recipes