సేవ్ పూరి

 

 

కావలసిన పదార్థాలు:

పూరీలు                                         - 6

స్వీట్ చట్ని                                     - 1 టేబుల్ స్పూన్

సన్నగా తరిగిన కొత్తిమెర                  - ½ టేబుల్ స్పూన్

ఉప్పు                                            -  ¼ టీ స్పూన్

ఉడికించిన బంగాళాదుంప                - 1 టేబుల్ స్పూన్

సన్నగా తరిగిన ఉల్లిపాయలు           - 1 టేబుల్ స్పూన్

సన్నగా తరిగిన టమాటో                 - 1 టేబుల్ స్పూన్

కారం                                            - ¼ టీ స్పూన్

చాట్ మసాలా                                - ¼ టీ స్పూన్

సేవ్(సన్న కారపూస)                      - 2 టేబుల్ స్పూన్లు                                             

తయారుచేసే విధానం:

1.      ముందుగా పూరీలు ఒక ప్లేట్ లో పెట్టుకొని వాటికి చిల్లు పెట్టాలి. ఇలా చిల్లులు పెట్టిన పూరీలలో కొద్దిగా ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేయాలి.

2.      తరువాత వీటిపైన కారం, ఉప్పు, చాట్ మసాలా చల్లాలి. తరువాత సేవ్ వేయాలి.

3.      దీనిపైన కొద్దిగా స్వీట్ చట్ని వేసి కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. నోరూరించే సేవ్ పూరీ రెడీ.