సగ్గుబియ్యం పులావ్

 

 

కావలసిన పదార్థాలు:

సగ్గుబియ్యం                                              - ఒక కప్పు
క్యారెట్                                                      - ఒకటి
ఫ్రెంచ్ బీన్ ముక్కలు                                  - పావుకప్పు
పచ్చి బఠాణీ                                              - పావుకప్పు
పచ్చిమిర్చి                                                - ఒకటి
యాలకుల పొడి                                         - అర చెంచా
లవంగాల పొడి                                          - ఒక చెంచా
బిర్యానీ ఆకు                                             - ఒకటి
సన్నగా తరిగిన బాదం పప్పు                     - రెండు చెంచాలు
వేయించిన జీడిపప్పులు                            - నాలుగు
ఉప్పు                                                      - తగినంత
నెయ్యి                                                      - కావలసినంత

తయారీ విధానం:

సగ్గుబియ్యాన్ని నాలుగైదు గంటల పాటు నీటిలో నానబెట్టి ఉంచాలి. క్యారెట్ ను, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.  స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కాక కూరగాయల్ని, పచ్చిమిర్చిని వేయాలి. రెండు నిమిషాలు వేయించాక యాలకుల పొడి, లవంగాల పొడి, బిర్యానీ ఆకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టేయాలి. బాగా వేయించాలి. ముక్కలు బాగా ఉడికిపోయిన తరువాత సగ్గుబియ్యం వేసి కలపాలి. రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తరువాత రెండు కప్పుల నీళ్లు వేసి మూత పెట్టాలి. నీళ్లన్నీ ఇగిరిపోయి పులావ్ రెడీ అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా బాదం, జీడిపప్పు వేసి, రెండు మూడు చెంచాల నెయ్యి కూడా వేసి దించేయాలి.

- Sameera