రోజ్ మిల్క్ షేక్

 




కావలసిన పదార్థాలు :

రోజ్ సిరప్ - ఒక కప్పు

పాలు - ఒకటిన్నర కప్పు

చక్కెర - ఒక కప్పు

క్రీం - ఒక కప్పు

గుడ్డు - ఒకటి

రోజ్ పెటల్స్ - కొన్ని


తయారుచేసే పద్ధతి :

ముందుగా కాచి  చల్లార్చిన పాలు ఓ  గిన్నెలోకి తీసుకుని  అందులో క్రీం, చక్కెర వేసి బాగా కలపాలి.

 

ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్డు సొనతో , రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి .తరువాత ఈ  మిశ్రమాన్ని ఫ్రిజ్ లో గంటసేపు పెట్టాలి.

 

ఇప్పుడు పొడవాటి గాజు గ్లాసు తీసుకుని అందులో రోజ్ మిల్క్ షేక్ పైన రోజ్ పెటల్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి...