రాజ్ భోగ్

 

 

కావలసిన పదార్ధాలు:

పాలు 1 లీటర్ (చిక్కనివి)
పంచదార  750 గ్రాములు
యాలకుల పొడి  1 స్పూన్
రోజ్ వాటర్  1 స్పూన్
నిమ్మరసం 2 స్పూన్స్
ఫుడ్ కలర్ 1/4 స్పూన్
బాదం  ఒక స్పూన్
పిస్తా  2 స్పూన్లు


తయారు చేసే విధానం:
ముందుగా రెండు కప్పుల పాలు, 2 స్పూన్స్ పంచదార వేసి సగానికి సగం వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా పప్పులు, యాలకుల పొడి వేసి మిశ్రమం గట్టి పడే వరకు ఉడికించి దించాలి. కొద్దిగా చల్లారిన తరువాత చిన్న ఉండలుగా చేసి ఉంచాలి.

మరోక పాత్రలో మిగిలిన పాలు పోసి మరిగించాలి. మరగడం మొదలు కాగానే ఫుడ్ కలర్, నిమ్మరసం వెయాలి. పాలు విరిగిపోగానే దించి పలుచని బట్టలో వేసి నీళ్ళన్నీ మొత్తం తీసేయ్యాలి. తరువాత పాల విరుగుడును తీసుకుని  ఉండలుగా చేసి . ముందుగా  తయారు చేసిన ఉండాలని ఈ ఉండాల మద్యలో పెట్టి మళ్లీ దాన్ని ఉండలుగా చేయాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె  పెట్టి పంచదార వేసి, సరిపడ నీళ్ళు పోసి పంచదార కరిగేవరకూ మరిగించాలి. ఇప్పుడు తయారు చేసిన ఉండాలని పంచదార పాకం లో వేసి పది నిముషాలు మరిగించి దించాలి.

చివరలో అందులో రోజ్ వాటర్ కలిపి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి