రాగిపిండి వడియాలు

 

 

కావలసిన పదార్థాలు:

రాగిపిండి - రెండు కప్పులు
నీళ్లు - పది కప్పులు
కారం - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
ఇంగువ - చిటికెడు
జీలకర్ర పొడి - కొద్దిగా

తయారీ విధానం:

రాగిపిండిలో నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నీటిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండిని వేయాలి. ఉండ కట్టకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దగ్గర పడిన తరువాత ఇంగువ వేసి కలిపి దించేయాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. తరువాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఓ పాలిథీన్ షీట్ మీద వడియాల్లాగా వేసుకోవాలి. వీటిని బాగా ఎండబెట్టి భద్రపరచుకోవాలి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి.

- Sameera