పుదీనా చాస్

 

 

కావలసిన పదార్థాలు:

పెరుగు                                           - ఒక కప్పు
పుదీనా ఆకులు                              - పది
నీళ్లు                                              - ఒకటిన్నర కప్పు
జీలకర్ర పొడి                                    - ఒక చెంచా
నల్ల ఉప్పు                                      - తగినంత
మిరియాల పొడి                              - చిటికెడు

 

తయారీ విధానం:

పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడగాలి. పెరుగులో మీగడ లేకుండా చూసుకోవాలి. పెరుగు, పుదీనా కలిపి మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఆపైన నీళ్లు, జీలకర్ర పొడి, ఉప్పు కూడా వేసి బాగా బ్లెండ్ చేయాలి. తరువాత దీనిని గ్లాసుల్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి, మిరియాల పొడి చల్లి అందించాలి. దాహార్తిని తీర్చడమే కాదు... వేసవి వేడి వల్ల వచ్చే బోలెడన్ని సమస్యల నుంచి ఈ డ్రింక్ కాపాడుతుంది.

- Sameera