పొట్లకాయ నువ్వులపొడి కూర (అట్లతద్ది స్పెషల్)

 

 


కావలసిన పదార్థాలు:

పొట్లకాయ -1
నువ్వులు - 5 లేదా 6 చెంచాలు
ఎండుమిర్చి - 4 లేదా 5
జీలకర్ర - అర స్పూను
పసుపు - కొద్దిగా
ఉప్పు -అర స్పూను
నూనె - పోపుకి తగినంత
పోపు గింజలు - మినపప్పు, ఆవాలు, శెనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి

తయారు చేయు విధానం:

పొట్లకాయను చక్రాలుగా గాని చిన్న ముక్కలుగా గాని తరిగి... ఉడకపెట్టి.. వార్చి.. పక్కన పెట్టుకోవాలి. పొడి మూకుడులో నువ్వులు దోరగా చిటపటలాడేవా వేయించుకుని, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. అన్నీ కలిపి కాస్త చల్లారాక పొడి కొట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి పోపుగింజలు వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకుంటూ.. అవి కమ్మని వాసన రాగానే పొట్లకాయ ముక్కలు వేసి పసుపువేసి కలపాలి. తరువాత నూవ్వులపొడి పైన జల్లి ఉప్పు వేసి.... పూర్తిగా కూరకలిపి దింపుకోవాలి. ఈ కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా రుచిగా కూడా ఉంటుంది.

- భారతి