Facebook Twitter Google

Home >>Appetizers >>Pineapple Raita

 

 

పైనాపిల్ రైత

 

 

రైతా అనేది చాలా పాపులర్ ఇండియన్ సైడ్ డిష్. దీనిని సాధారణంగా పరాటా, పులావ్ మరియు బిర్యానీ కాంబినేషన్ తో తీసుకుంటారు.

రైతా ఆరోగ్యానికి చాలా  మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు ఇతర వేడి సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇన్ని ఉపయోగాలు వున్న రైతాని వెరైటీ గా పైన్ ఆపిల్ flavor తో  తయారు చేసేద్దాం రండి .

 

కావలిసిన పధార్థాలు:

పెరుగు                            - 2 కప్పులు

పైన్ఆపిల్ ముక్కలు           - 2 కప్పులు

దానిమ్మ గింజలు               - 2 స్పూన్స్

జీలకర్ర పొడి                     - 2 స్పూన్స్

నల్ల మిరియాల పొడి          - 1/4 స్పూన్

కొత్తిమీర తరుగు                - 2 స్పూన్స్

ఉప్పు                           - రుచికి తగినంత

 

తయారీ విధానం:

* ఒక  బౌల్  లో పెరుగుని  చిలికి  పెట్టుకోండి.

* చిలికిన పెరుగులో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి  కలపండి.

* ఈ మిశ్రమం లో పైన్ఆపిల్ ముక్కలు కలిపి 10-15 నిముషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి.

* దీనిని దానిమ్మ గింజలు, కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

 

Tip: తాజాదనాన్ని కాపాడటానికి మీరు పైనాపిల్ రైతాని చల్లగా ఉంచండి.

 

Other Appetizers Recipes