సజ్జ పెసరట్టు

 


కావలసిన పదార్ధాలు:


సజ్జలు - 1 కప్పు

బియ్యం - గుప్పెడు

నూనె లేదా నెయ్యి - అట్లు కాల్చడానికి తగినంత

పెసలు - 1 కప్పు

ఇంగువ - పావు టీ స్పూను

ఇంగువ - పావు టీ స్పూను

జీలకర్ర - అర టీ స్పూను

జీలకర్ర - అర టీ స్పూను

తరిగిన పచ్చి మిర్చి - 4

అల్లం తురుము - 2 టీ స్పూన్లు

ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం:

ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టి, ఒంపేయాలి.

గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి.

స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి. గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి.

రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.