సజ్జ హల్వా

 

కావలసిన పదార్ధాలు:

సజ్జ పిండి - ఒక కప్పు

నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు

కిస్‌మిస్‌ - తగినన్ని

బెల్లం లేదా పటిక బెల్లం  - పొడి 1 కప్పు

ఏలకుల పొడి - అర టీ స్పూను

జీడి పప్పులు - తగినన్ని

 

తయారుచేసే విధానం:

స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి వేసి దోరగా వేయించాలి. మూడు కప్పుల నీళ్లలో పటిక బెల్లం పొడి వేసి కరిగించి, వేయించుకుంటున్న పిండిలో పోసి కలుపుతుండాలి (బెల్లం పొడి వాడుతుంటే, మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి వేసి లేత పాకం పట్టాలి.

ఆ పాకాన్ని వేయించుకుంటున్న పిండిలో వేసి కలియబెట్టాలి). బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి జత చేయాలి. కమ్మని వాసన వచ్చి హల్వాలా తయారయ్యేవరకు కలిపి దింపేయాలి.

ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఆ ప్లేట్‌లో హల్వా పోసి సమానంగా సర్దాలి. చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీసేయాలి. తయారుచేసుకున్న హల్వా మీద అలంకరించి వేడివేడిగా అందించాలి.