పచ్చిబఠాణీ సలాడ్

 

 

కావలసిన పదార్ధాలు:

గ్రీన్ పీస్ బఠాణీ - ఉడికినవి 2 కప్పులు 

ఉల్లిముక్కలు - 1 కప్పు 

టమోటో సన్నని ముక్కలు - 2 కప్పులు 

మిరియాలపొడి - చిటికెడు 

ఉప్పు, కారం - తగినంత 

నెయ్యి - 1\4 స్పూన్ 

కొత్తిమీర - సరిపడ

గరం మసాలా - చిటికెడు

నిమ్మరసం - సరిపడ

 

తయారుచేయు విధానం:

ముందుగా బఠాణీలను బాగా ఉడకబెట్టినవి బౌల్ లోకి తీసుకోవాలి. 

 

వీటికి మిగతా ముక్కలు కలపాలి. 

 

వీటికి ఉప్పు, కారం, గరంమసాలా, నెయ్యి, మిరియాలపొడి వేసి కలిపి చివరగా నిమ్మరసం కలిపి కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. 

 

ఇది కూడా లోక్యాలరీ సలాడ్... అంతే పచ్చిబఠాణీ సలాడ్ రెడీ..