పకోడీలు

 

 


మనకు ఎంతో ఇష్టమైన కరకరలాడే కమ్మనైన వేడి వేడి పకోడీల తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

 

కావాల్సిన పదార్దాలు: 

ఉల్లిపాయ ముక్కలు                  - ఒక కప్పు

అల్లం ముక్కలు                        - ఒక చెంచా

పచ్చి మిర్చి ముక్కలు                - ఒక చెంచా

శనగ పిండి                               - 2 చెంచాలు

కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి)    - అర చెంచా

వరిపిండి                                   - ఒక చెంచా

ఉప్పు                                        - తగినంత

నూనె                                       - తగినంత


తయారుచేయు విధానం:

* ఒక గిన్నె లో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు మరియు చిన్న చిన్నగా  తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. కావాలి అనుకుంటే జీలకర్ర కూడా కలుపుకోవచ్చు. (ముందుగా ఉల్లిపాయ ముక్కలకు ఉప్పు కలుపుకోవాలి. దాని వలన ఉల్లిపాయ ముక్కల నుండి నీరు వస్తుంది. ఆ నీరు పిండి కలుపుకోడానికి ఉపయోగపడుతుంది.)

* తరువాత వాటిలో 2 నుండి 3 చెంచాల  శనగపిండిని కలపాలి. 

* పకోడీ కరకరలాడాలంటే ఒక చెంచా వరిపిండిని కలుపుకోవాలి. (వరిపిండి ఎక్కువైతే పకోడీ గట్టిగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి)

* మరియు అర చెంచా కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి.

* తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి పకోడీ వేయించడానికి సరిపడినంత నూనె తీసుకోవాలి. నూనె వేడి అయ్యాక  పకోడీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 

* తరువాత వాటిని డబల్ టిష్యు పేపర్ ఉన్న గిన్నె లో తీసుకోవాలి. దాని వలన పకోడీకి నూనె అంటదు. 

ఇలానే ఉల్లిపాయకు బదులు ఆనపకాయ, క్యాబేజీ, పన్నీరు, బేబీ కార్న్ మరియు బ్రెడ్ తో కూడా రకరకాలుగా పకోడీ తయారు చేసుకొవచ్చు.

*  శనగపిండి తినని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే వాము కూడా వేసుకుని రుచికరంగా చేసుకోవచ్చు.