పచ్చి మామిడికాయ జ్యూస్

 

 

కావలసినవి :

పచ్చి మామిడికాయలు - అర కిలో

నల్ల ఉప్పు - ఒకటిన్నర  స్పూన్

జీలకర్ర  పౌడర్  - ఒక స్పూన్

పంచదార - తగినంత

చాట్ మసాల - ఒక చెంచా

వాటర్  - లీటర్


తయారీ :

ముందుగా మామిడికాయలు కడిగి ముక్కలు తరిగి  పెట్టుకొవాలి.  స్టవ్ వెలిగించి పాన్ లో  నీళ్ళు  పోసి అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసి  మూత  పెట్టి   ఉడికించాలి.  ముక్కలు బాగా ఉడికాక  అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారక మిక్సిలో వేసి పేస్ట్ లా చేసి కొద్దిగా నీళ్ళు కలిపి  వడ కట్టి  రసాన్ని తీసుకోవాలి.  ఈ రసానికి సరిపడా నీళ్ళు  పోసి  కలిపి అందులో నల్ల ఉప్పు, జీరా పౌడర్  , పంచదార , చాట్ మసాల వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని తరువాత సర్వ్ చేసుకోవాలి..