నట్టీ అల్మండ్ కేక్ 

 

 

 

కావాల్సిన పదార్థాలు :

మైదాపిండి                  - 1 కప్పు 

బాదం                         - 1 కప్పు 

క్యాస్టార్ షుగర్               - 1 కప్పు ( పౌడర్ చేసిన షుగర్ )

కాపీ పౌడర్                   - 1 టిస్పూన్

ఎగ్                              - 1 

వెన్న(బటర్)                  - 1 టిస్పూన్

డ్రామ్ (రమ్)                  -  1 టిస్పూన్

వెనీలా వెసేమ్స్               - 1 టిస్పూన్

పాలు                            - 12౦మి .లీ 

బేకింగ్ పౌడర్                   -  2  టిస్పూన్

మార్సిపాన్

రఫ్ లీ,/p>

 

తయారుచేసే విధానం:

ఒక కోడి గుడ్డు తీసుకొని దానిని పగులగొట్టి ఒక బౌల్ లోకి ద్రవాన్ని తీసుకొవాలి. అందులో క్యాస్టార్ షుగర్ వేసి పసుపు రంగు నుంచి కొంచెం తెలుపు రంగులోకి మారేంత వరకు కలుపుకోవాలి. ఇందులో 1 టిస్పూన్ వనీలా ఎసెన్స్ కలిపితే ఆ తరువాత ఇంకొంచెం తెలుపు రంగులోకి  మారుతుంది. దీనికి రమ్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా తయారైన కేక్ ని పక్కన పెట్టుకోవాలి.  

ఇప్పుడు ఓవెన్ ను 190 డిగ్రీస్ వద్ద వేడి చేసి వుంచుకోవాలి. ఒక కప్పు జల్లెడ పట్టిన మైదాపిండితో ముందుగా తయారుచేసి పెట్టుకున్న బాదం పౌడర్ (బాదం పప్పుని మిక్సి లో వేసి పౌడర్ చేసుకోవాలి ) కలుపుకోవాలి.. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయనవసరం లేదు. ఇక ఈ మిశ్రమంలో 2 టిస్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంటే మరికొన్ని పాలు వేసి కలపాలి. ఆ తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టి దానికి కొంచెం బటర్ రాసుకోవాలి... నాన్ స్టిక్ లేదా సిలికాన్ కూడా వాడుకోవచ్చు.  ఇప్పుడు దానిలో కేక్ బ్యాటర్ వేసి ఓవెన్‌ని 190 డిగ్రీస్ లో 20, 25 మినిట్స్ ఉంచితే  Nutty almond cake రెడి...