Home >>Sweets N Deserts >>New Year Special Cake

 

 

న్యూ ఇయర్ కేక్

 

 


కావలసిన పదార్ధాలు:

మైదా                       -  నాలుగు కప్పులు

గుడ్లు                       -   నాలుగు

వెనీలా ఎసెన్స్           -   రెండు చెంచాలు

టూటీ ఫ్రూటీ              -   రెండు కప్పులు

కాండెడ్ పిల్              -  రెండు కప్పులు

కిస్‌మిస్                   -  కొద్దిగా

జీడిపప్పు                  -  తగినంత

వెన్న                       -  ఒక కప్పు

కార్మేల్ కలర్             - రెండు చెంచాలు

చక్కెర                      - రెండు కప్పులు

బేకింగ్ పౌడర్             - రెండు చెంచాలు

తయారుచేసే పద్ధతి:

* ముందు ఒక గిన్నె తీసుకొని అందులో వెన్న, చక్కెర వేసి బాగా మెత్తగా కలుపకోవాలి.
* ఇప్పుడు అందులో వెనీలా ఎసెన్స్, సన్నని ముక్కలుగా తరిగిన డ్రైఫ్రూట్స్, కార్మేల్ కలర్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
* తరువాత కోడిగుడ్లను పగలగొట్టి తెల్ల సొనను వేరే గిన్నెలో తీసుకొని.. పసుపు సొనను ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో కలపాలి.
* తెల్లసొనను ఎగ్ బీటర్‌తో తెల్ల నురుగు వచ్చే వరకు గిలకొట్టి... దీన్ని కూడా మిశ్రమంలో కలపాలి.
* ఇప్పుడు మైదాపిండి, బేకింగ్ పౌడర్ రెండింటిని కలిపి జల్లించి..ఆ పిండిని గుడ్లు కలిపిన మిశ్రమానికి చేర్చి మెల్లగా కలపాలి.
* ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దానిని కుక్కర్ గిన్నె లేదా కేక్ ఒవెన్‌లో పోసి పైన జీడిపప్పు చల్లి ఇరవై నిమిషాలు బేక్ చెయ్యాలి. అంతే న్యూ ఇయర్ కేక్ నోరూరించేలా సిద్ధమవుతుంది

Related Recipes