మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి

 


మష్రూమ్స్ తో  ఎలాంటి వంటకం చేసినా భలే రుచిగా ఉంటుంది. అలాంటిది ఏకంగా మంచూరియా చేస్తేనో, ఇంకా ఆ టేస్ట్ అదిరిపోతుంది. అందుకే ఈ రోజు స్పైసి స్పైసిగా ఉండే మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి ఎలా చెయ్యాలో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు:

మష్రూమ్స్ - 1/4 కేజీ

పొటాటో - 2

అల్లం తురుము - 1 చెంచా

వెల్లుల్లి తురుము - 1 చెంచా

సన్నగా తరిగిన పచ్చి మిర్చి - 1 చెంచా

ఉల్లితరుగు - 1/4 కప్పు

మైదా - 3 చెంచాలు

కార్న్ ఫ్లోర్ - 3 చెంచాలు

కొత్తిమీర - 1 కట్ట

సోయా సాస్ - 1 చెంచా

చిల్లి సాస్ - 1 చెంచా

వెనిగర్ - 1 చెంచా

పంచదార - చిటికెడు

ఉప్పు కారం - తగినంత

తయారి విధానం:

ఇవి తయారుచేసుకోవటానికి ముందుగా మష్రూమ్ కాడలు తీసి వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని తరిగిన కాడలు వేసి. ఉడికించిన పొటాటో కలపాలి. అందులోనే ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర కాస్తంత కార్న్ ఫ్లోర్ వేసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్ ఉప్పు వేసి నీళ్ళు పోసి కలిపి స్టఫ్ చేసిన మష్రూమ్స్ ని అందులో ముంచి కాగిన నూనెలో వేసి వేయించాలి. ఇప్పుడొక పేన్ లో కాస్త నూనే వేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత దానిలో పచ్చిమిర్చి ఉల్లితరుగు వేయాలి. అలా వేగుతున్న వాటిలో సోయా సాస్, చిల్లి సాస్, వెనిగర్ మిగిలిన కొత్తిమీర తరుగు వెయ్యాలి. కావాల్సిన వాళ్ళు కొద్దిగా టమాటా సాస్ ని కూడా జత చేసుకోవచ్చు. ఇలా తయారయిన దానిలో వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసి అన్నిటికి సాస్ మిశ్రమం అంటుకునేలా చేయాలి. పైన కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోవచ్చు. రుచిగా ఉండే మష్రూమ్ మంచురియన్ డ్రై రెసిపి రెడీ అయినట్టే.

 

..కళ్యాణి