మసాలా లస్సీ

 

 

కావలసిన పదార్థాలు:

పెరుగు                                            - మూడు కప్పులు
యాలకులు                                     - మూడు
మిరియాలు                                     - ఆరు
జాపత్రి                                             - చిన్న ముక్కలు
దాల్చినచెక్క పొడి                             - చిటికెడు
బాదం పప్పులు                               - ఐదు
జీడిపప్పులు                                   - ఐదు
కుంకుమపువ్వు                              - చిటికెడు
తురిమిన బెల్లం                               - మూడు చెంచాలు

తయారీ విధానం:

జీడిపప్పు, బాదంపప్పుల్ని మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. మిరియాలు, జాపత్రి, యాలకుల్ని కలిపి పొడి చేసుకోవాలి. పెరుగును బెల్లం, నీటితో కలిపి మిక్సీలో వేసి లస్సీలాగా బ్లెండ్ చేసుకోవాలి. తరువాత దీనిలో బాదం, జీడిపప్పుల పేస్ట్, మసాలా పొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తీసి, గ్లాసుల్లో పోసి, కుంకుమ పువ్వు చల్లి అందించాలి. స్పైసీనెస్ ఇష్టపడేవాళ్లకి ఈ లస్సీ బాగా నచ్చుతుంది.

- Sameera