మాంగో కుల్ఫీ

 

ఎర్రటి ఎండల్లో చల్లటి మిల్క్ షేకులు, ఐస్ క్రీం లు, కుల్ఫీలు తింటే ఆహా ఎంత బాగుంటుందో. ప్రతిసారి బయటకెళ్ళి బోలెడన్ని డబ్బులు పోసి ఐస్ క్రీం లు కొనితెచ్చుకోవటం కన్నా, ఇంట్లోనే తయారుచేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మరి మామిడిపండుతో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామా.


కావాల్సిన పదార్థాలు:

మామిడిపండు గుజ్జు - 1 కప్పు

పంచదార - 1/4 కప్పు

పాలపొడి - 1/4 కప్పు

చిక్కటి పాలు - 1 కప్పు

యాలకుల పొడి - చిటికెడు

చెర్రి ముక్కలు - 2 చెంచాలు


తయారి విధానం:

ఇది తయారు చేయటానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పాలు పోసి, ఆ పాలల్లో పంచదార, పాలపొడి వేసి ఉండలు కట్టకుండా కదుపుతూ ఉండాలి. అది బాగా మరిగాకా కాస్త దగ్గర పడుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు అందులో  యాలకుల పొడి, ఉంటె కాస్త కుంకుమ పువ్వు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మనింట్లో ఉండే కుల్ఫీ మౌల్డ్స్ లో ఈ మిశ్రమాన్ని వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అవి తయారయ్యాకా తినటమే. కుల్ఫీ మౌల్డ్స్ లేనివాళ్ళు చిన్న గ్లాసుల్లో ఈ మిశ్రమం పోసి కుల్ఫీ తయారుచేసుకోవచ్చు. గార్నిష్ కోసం కావాలంటే చెర్రి ముక్కలు వాడుకోవచ్చు. అంతే మనమే మన చేతులతో  స్వయంగా తయారుచేసుకున్న కుల్ఫీ తిని సెల్ఫీ తీసుకోవటమే.

-కళ్యాణి