Home >>Sweets N Deserts >>Korra Biyyam Payasam(sravana Sukravaram Special)

 

 

శ్రావణ మాసం (వరలక్ష్మీవ్రతం స్పెషల్)


కొర్ర బియ్యంతో చెక్కర పొంగలి

 

 

కావలసిన పదార్దాలు :-

* కొర్ర బియ్యం         - 1/2కప్పు  
* పెసరపప్పు          - 1/2 కప్పు
* నెయ్యి                 - 4 స్పూన్
* డ్రై ఫ్రూట్స్             - 1/4 కప్పు  
* ఇలాచీ పౌడర్       - చిటికెడు
* మిల్క్ మెయిడ్    - 200 గ్రాములు

తయారు చేసే విధానం:-

* విడివిడిగా కొర్రబియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టు కోవాలి.

* ఇప్పుడు బాణలిలో ౩ చెంచాలు నెయ్యి వేసి... నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి అందులో నానిన పెసరపప్పువేసి కమ్మని వాసనా వచ్చే వరకు  వేయించుకోవాలి

* ఆ తరువాత కొద్దిగా నీరుపోసి పెసరపప్పు... సగంపైన ఉడికిన తరువాత కొర్రబియ్యం వేసి మరి కొద్ది నీటిని జోడించి....  రెండు పూర్తిగా ఉడికిన తరువత ఇలాచీ పౌడర్, మిల్క్ మెయిడ్ వేసి 1 స్పూన్ నేతిని జోడించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

* చాలా రుచిగా ఉండే కొర్రబియ్యం చెక్కర పొంగలి రెడీ అయిపోయినట్లే.... దీనిని పాలతో ఉడికించి బెల్లం తరుగు (లేదా) చెక్కర కూడా కలుపుకోవచ్చు .

Related Recipes