కొబ్బరి చెక్కలు

 

 

కొబ్బరితో మనం తాలా వెరైటీస్ తయారు చేసుకుంటాం. అయితే ఈసారి కొబ్బరి చెక్కలు కూడా ట్రైచేసి చూడండి.

కావలసిన పదార్ధాలు..

కొబ్బరి చిప్పలు              -    2
బియ్యం                        -    1/2 కేజి
నెయ్యి                          -    1/4 కేజి
శనగపప్పు                      -    1/2 కప్పు
జీలకర్ర                          -    1 టేబుల్ స్పూన్
కరివేపాకు                      -    1 కట్ట
కొత్తిమీర                        -    1 కట్ట
పచ్చిమిర్చి                     -    10
ఉప్పు                             -    తగినంత
పసుపు                          -    చిటికెడు.
నూనె                             -    వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

* ముందుగా బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని తీసేసి మిక్సీలో పిండి పట్టుకోవాలి
* ఇప్పుడు కొబ్బరి చిప్పలు తీసుకొని వాటిని కోరి.. ఆ తురుమును పిండిలో వేసి కలుపుకోవాలి.
* ఇంకా అల్లం, పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి దానిని, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టిన శెనగపప్పు వేసి కలుపుకోవాలి.
* అలా అన్నీ వేసి గట్టి ముద్దగా కలుపుకున్నాక.. స్టౌ మీద బాండీ పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఇందాకటి పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా తీసుకుని పాలిధిన్ కవర్‌పై ఒత్తి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.