కొబ్బరి బూరెలు (దీపావళి స్పెషల్)

 

 

 

కావలసిన పదార్దాలు:-


బియ్యం - 1/2 కేజీ

బెల్లం - 3/4 కప్పు

కొబ్బరి కోరు - 1 కొబ్బరికాయతో వచ్చిన కోరు

ఇలాచీ - 1/2 స్పూన్ పొడి

నూనె - వేయించాడనికి సరిపడినంత

 


తయారీ విధానం:-


బియ్యం నానబెట్టి.. కడిగి వాడేసి.. మిక్సీలో గాని.. విడిగా బయట మిల్లులో గాని పిండి తయారుచేసుకోవాలి. ఈ తడి పిండిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం చిన్నముక్కలుగా చేసుకొని... కొద్దినీరు పోసి ఉండపాకం రానివ్వాలి... ఆ పాకంలో కొబ్బరికోరు వేసి ఇలాచీ పొడి జల్లి.. వరి పిండి కొద్దికొద్దిగా వేస్తూ మన చలిమిడి ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. చేతికి ఉండలా రావాలి. దానిలో కొద్దిగా నూనె పోసి ప్రక్కన పెట్టుకోవాలి. నూనె వెయ్యడం వల్ల.. చేతికి అంటుకోకుండా నున్నగా ఈ పిండిని ఉండలు చేసుకుని.. చేతిలోగాని కవర్ పై గాని, అప్పాల మాదిరి వత్తుకోడానికి సులువుగా ఉంటుంది. బాణలిలో నూనె వేసి బాగా కాగాక.. మంట తగ్గించి ఒక్కొక్కటిగా.. ఈ బూరెలను నూనెలో వదలాలి... వెంటనే తిరగేసుకుని.. అతి తక్కువ సమయంలో ఇవి వేగుతాయి. వీటిని టిష్యు పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇవి 5, 6 రోజులు నిల్వ ఉంటాయి కూడా.

- భారతి