కాశ్మీరీ మటన్ కర్రీ

 

 

 

కావలసినవి:

బోన్ లెస్ మటన్ - 800 గ్రాములు

ఉల్లిపాయలు - 2

అల్లం పేస్ట్ - 2 స్పూన్లు

వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు

బటర్ - 200 గ్రాములు

పసుపు - 2 స్పూన్లు

మైల్డ్ కర్రీ పౌడర్ - 4 స్పూన్లు  (సూపర్  మార్కెట్స్ లో   దొరుకుతుంది)

కారం - రెండు స్పూన్లు

సాల్ట్ - రెండు స్పూన్లు

గరం మసాలా - రెండు స్పూన్లు

గుడ్లు - 4 (పచ్చ సోన)

కోకోనట్ క్రీమ్ - 200 గ్రాములు

ఫ్రెష్ క్రీమ్ - 200 గ్రాములు

పెరుగు - 100 గ్రాములు

టమాటో ప్యూరీ - ఒక స్పూన్

క్యారమిలైస్డ్ బనానా ముక్కలు - అరకప్పు

 

( అరటి పండును అంగుళం మందంలో రౌండ్ ముక్కలుగా గా కట్ చేసుకుని పంచదారలో రెండువైపులా అద్ది స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ముక్కలు ఒక్కొక్కటిగా పరిచి రెండు వైపుల ఉడికాక అవన్నీ ఒక ప్లేట్ లోకి తీసిపెట్టుకోవాలి)

 

తయారీ:

ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి బటర్ వేసి ఉల్లిపాయలు వేసి సన్నని మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్,కర్రీ పౌడర్,పసుపు,కారం ,సాల్ట్ వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఒక ఐదు నిముషాలు ఉడికించాలి. తరువాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ వేసి వేయించాలి.ఇప్పుడు కోకోనట్ క్రీమ్ పచ్చసోన వేసి కలిపిన మిశ్రమాన్ని వేసి ఉడకనివ్వాలి. తరువాత ఒక కప్ తీసుకుని అందులో క్రీమ్,పెరుగు, టమాటో ప్యూరీ అన్నింటిని వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి స్టవ్ పై వేరొక పాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని వేసి ఒక చిక్కగా అయ్యేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మటన్ లో పక్కన పెట్టుకున్నమిశ్రమాన్ని వేసి కలుపుకుని గరం మసాలా వేసి గ్రేవీ దగ్గరకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారమిలైస్డ్ బనానా తో డెకరేట్ చేసుకుని చపాతీ కాని బిర్యానితో కాని సర్వ్ చేసుకోవాలి.