జామ్ కుకీస్

 

 

కావలసిన పదార్ధాలు:

మైదాపిండి             - 100 గ్రా

బటర్                  - 5 గ్రా

ఐసింగ్ షుగర్          - 40 గ్రా

క్యాస్టింగ్  షుగర్       - తగినంత

జామ్                     - తగినంత

వెనీలా ఎస్సెన్స్        - ఒక టీ స్పూన్

 

తయారుచేసే విధానం:

* ముందుగా ఒక గిన్నె తీసుకొని  అందులో ఐసింగ్ షుగర్, బటర్, టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి మిశ్రమాన్ని మొత్తగా చేసుకోవాలి.
* ఇప్పుడు అందులో మైదా పిండి కూడా వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి.
* ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మిశ్రమాన్ని అందులో ఉంచి.. ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఓ పదిహేను నిమిషాలు లేదా.. అరగంట సేపు ఉంటుకోవాలి. (పాలిథిన్ కవర్ లో పెట్టడం వల్ల బటర్ మెల్ట్ అవకుండా ఉంటుంది)
* మిశ్రమం కొంచెం గట్టి పడిన వెంటనే దానిని బయటకు తీసి పైన కవర్ తీసేయాలి.
* ఇప్పుడు ఓవెన్ ట్రే తీసుకొని అందులో సిలికాన్ మ్యాట్ ఉంచుకోవాలి. (butter paper or aluminum foil కూడా ఉపయోగించుకోవచ్చు.)
* ఇప్పుడు ముందుగా చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ గా చేసి.. వాటిని కొంచెం ప్లాట్ గా చేసి.. క్యాస్టింగ్ షుగర్ లో డిప్ చేసి.. మధ్యలో ప్రెస్ చేయాలి.
* అలా చేసుకున్న వాటిలో ఇప్పుడు జామ్ తీసుకొని స్పూన్ తోవాటి మధ్యలో  వేసుకోవాలి.
* ఇలా రెడీ చేసుకున్న వాటిని ముందుగా 180 డిగ్రీస్ వద్ద ప్రీ హీట్ చేసుకున్న అవెన్ లో పెట్టి.. మళ్లీ 180 డిగ్రీస్ వద్ద 15 లేదా 20 నిమిషాలు ఉంచాలి. అంతే టేస్టీ జామ్ కుకీస్ రెడీ.