(ఇంట్లోనే తయారుచేసుకునే) పిజ్జా

 

 

కావలసిన పదార్థాలు:

మైదా                                                 - 1 కప్పు

ఈస్ట్                                                   - 2 స్పూన్స్

వంటషోడా                                         - 1/2 స్పూన్

క్యాప్సికం                                            - 1 (చిన్న ముక్కలు తరిగి ఉంచుకోవాలి)

టమాటాలు                                         - 3 (చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి)

టమాటా సాస్ & వెన్న                         - (మన ఇష్టానికి తగినంత వేసుకోవచ్చును)

పన్నీరు తురుము                                - 1/4 కప్పు

 

తయారీ విధానం:

* ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న గిన్నెలోకి కొంచెం నీరు తీసుకొని వేడిచేయాలి.

* నీరు వేడెక్కే లోపల ఒక బేసిన్ లోకి ఈస్ట్ & వంటషోడ తీసుకొని, కొద్దిగా చల్లని నీరు జల్లి కలిపి, ఆ మిశ్రమానికి మైదాపిండిని చేర్చి,  గోరువెచ్చని నీరు కలిపి చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకొని, 10 నిముషాలు పక్కన పెట్టాలి.

* ఇప్పుడు మళ్ళీ పిండిని మరొకసారి బాగా కలిపి, అర అంగుళం మందంలో గుండ్రంగా చపాతీలాగా చేతితో వత్తుకోవాలి.

* ఇప్పుడు పిజ్జా బేస్ తయారయ్యిందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంటపై పెనం (pan) పెట్టి, పెనానికి కొద్దిగా వెన్నరాసి, తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్ ని ఉంచి మూతపెట్టాలి.

* బేస్ కాలే లోపల ... సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు & టమాటా ముక్కలు వేరే స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

* కొద్దిసేపటికి పిండి బాగా కాలి ఉబ్బుతుంది. (ఉడుకుతుంది). ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమాటా & క్యాప్సికం ముక్కల మిశ్రమాన్ని బేస్ పైన వేసి, టమాటా సాస్, వెన్న, పన్నీరు తురుము వేసి మరికొద్దిసేపు ఉంచాలి.

* 10 నిముషాలు అయ్యాక ముక్కలుగా కోసుకొని, స్టవ్ ని ఆపెయ్యాలి. అంతే పిల్లలు - పెద్దలు ఎంతో ఇష్టపడే వేడివేడి రుచికరమైన పిజ్జా రెడీ. టమాటా సాస్ తో సర్వ్ చేసి తినేయ్యటమే......

-sweta vasuki