హేల్తి రెయిన్ బో సలాడ్

 


సమ్మర్ ఎండలు ఒకపక్క చిటపట చినుకులు మరో పక్క. వాతావరణంలో ఇలాంటి మార్పులు మన  ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తాయో తెలిదు. అందుకే ఎలాంటి వాతవారణమైనా మన బాడీ తట్టుకునేలా ఉండాలి. అలా ఉండాలంటే హేల్తీ సలాడ్స్ ఎంతైనా అవసరం. ఈ రైనబో సలాడ్ లో తాజా కూరలు, పళ్ళు రెండు  ఉండటం వల్ల హెల్త్ కి చాలా మేలు చేస్తుంది.

 

కావాల్సిన పదార్థాలు:

 

తురిమిన కేరట్ - 1 కప్పు

దానిమ్మ గింజలు - 1/2 కప్పు

పచ్చి టమాటాలు - 2

నల్ల ద్రాక్ష - 1/4 కప్పు

గ్రీన్ ద్రాక్ష - 1/4 కప్పు

తులసి ఆకులు - 7,8

ఉడికించిన పల్లీలు - 1/2 కప్పు

ఆపిల్ ముక్కలు - 1/2 కప్పు

నానబెట్టిన పెసలు, బొబ్బర్లు - 1/2 కప్పు

సన్నగా తరిగిన కొత్తిమీర - 1/2 కప్పు

 మిరియాల పొడి 1/2 చెంచా

నిమ్మరసం - 2 చెంచాలు

 

తయారీ విధానం:

 

టమాటా ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆపిల్ ని స్క్వేర్ ముక్కలుగా కట్ చేసుకుని ఉంచాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కేరట్ తురుము, దానిమ్మ గింజలు, పచ్చి టమాటా ముక్కలు, ద్రాక్ష పళ్ళు, ఉడికించిన పల్లీలు, ఆపిల్ ముక్కలు, స్ప్రౌట్స్, తులసి ఆకులు ఇలా అన్ని కూరలు, పల ముక్కలు వేసి అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి. నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక అరగంట మూత  పెట్టి పక్కన ఉంచి అప్పుడు సర్వ్ చేస్తే కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఉండే రైనబో సలాడ్ తినటానికి ఎంతో టేస్టీ గా ఉంటుంది.


..కళ్యాణి