జొన్నలు, జీడిపప్పు గోరుమీఠీలు

 

 

 

కావలసిన పదార్ధాలు:

జొన్న పిండి - 100 గ్రా

పెసర పిండి - 50 గ్రా

నూనె - 250 గ్రా

ఉప్పు - తగినంత

జీడి పప్పులు - 20 గ్రా

ఇడ్లీ రవ్వ - 50 గ్రా

మిరియాల పొడి - 10 గ్రా

నీళ్లు - తగినన్ని

 

తయారుచేసే విధానం:

ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో జొన్న పిండి, పెసర పిండి, ఇడ్లీ రవ్వ వేసి అన్నీ కలిసేలా కలపాలి. మరుగుతున్న నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి. జీడిపప్పు పలుకులు జత చేసి మరోమారు కలపాలి. చేతితో చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ, బొటన వేలితో ఒత్తుతూ గోరు మీఠీలు తయారుచేయాలి. అలా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.