ఫ్రైడ్ ఎగ్ కోఫ్తా రెసిపి

 

 

 

 

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు - 5
ఆలుగడ్డలు - 4
క్యారెట్లు -2
బీన్స్ - 250 గ్రాములు
ఉల్లిపాయలు -2
అల్లం - చిన్నముక్క,
పచ్చిమిరపకాయలు - 4
నిమ్మకాయ - 1
 ఉప్పు - తగినంత,
నూనె - వేయించడానికి సరిపడా,
మిరియాలు - అర టీ స్పూన్,
కార్న్‌ఫ్లోర్ - ఒకకప్పు.

 

తయారుచేయు విధానం:
ముందుగా ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా  చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి   అయ్యాక ఉల్లిపాయలు, అల్లంపేస్టు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. తరువాత క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు మెత్తగా చేసిపెట్టుకున్న ఆలూ కూడా వేసుకుని అందులోనే నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి  స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టి కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించాలి. ఈ కోఫ్తాలను నూనెలో వేయించుకోవాలి. మరొక పాత్రను తీసుకుని కోడిగుడ్డు సొన, ఉప్పు, మిరియాల పొడి వేసి గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి  కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ గుడ్డు సొన మిశ్రమాన్ని వేసి దాని మధ్యలో కోఫ్తాను ఉంచాలి. ఆ  మిశ్రమం మొత్తం కోఫ్తా కు పట్టేల చెయ్యాలి...