రాగి సేమ్యా ఖీర్‌

 

 

 

కావలసిన పదార్ధాలు:

రాగి సేమ్యా - అర కప్పు

ఏలకుల పొడి - చిటికెడు

కొబ్బరి తురుము - పావు కప్పు

కొబ్బరిపాలు - 2 కప్పులు

నెయ్యి - తగినంత

బెల్లం పొడి - అర కప్పు

జీడి పప్పు పలుకులు - 20

 

తయారుచేసే విధానం: 

ముందుగా స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి... జీడిపప్పులు  వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. రాగి సేమ్యాను కూడా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి.. ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మరుగుతున్న పాలలో సేమ్యా వేసి కలపాలి. సేమ్యా ఉడికిన తరవాత బెల్లం పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించాలి. బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి.