ఎగ్ లెస్ ఫ్రూట్ కేక్

 


ఎలాంటి అకేషన్ వచ్చినా మన ఆనందాన్ని తెలియచేయటానికి మనం చేసే మొదటి పని కేక్ కట్ చేయటం. అయితే కొంతమంది గుడ్డు తినరు. అలాంటివాళ్ళ కోసం ఈ రోజు ఎగ్ లెస్ కేక్ ఎలా తయారుచెయ్యాలో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు:

మిల్క్ మెయిడ్ - 200 మిలీ

బటర్ - 60 గ్రా

మైదాపిండి - 100 గ్రా

పాలు - 30 మిలీ

నిమ్మరసం - 1/4 స్పూన్

వెనీలా ఎసెన్స్ - 1 టీ స్పూన్

బేకింగ్ సోడా - చిటికెడు

బేకింగ్ పౌడర్ - 1 స్పూన్

జీడి పప్పు - 8

బాదం పప్పు - 8

టూటి ఫ్రూటి - కొంచెం


తయారి విధానం :


ఈ ఎగ్ లెస్ కేక్ తయారుచేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మిల్క్ మెయిడ్, బటర్, పాలు, ఎసెన్స్ వేసి గరిటెతో బాగా కలపాలి. అందులో నిమ్మరసం పిండి జల్లించిన మైదా పిండి బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ వేసి మొత్తాన్ని మళ్లీ బాగా కలపాలి. ఆ మిశ్రమంలో జీడిపప్పు, బాదం పప్పు వెయ్యాలి. ఆ మిశ్రమాన్ని మొత్తం గ్రీస్ చేసిన ట్రే లో పోసి ఒవెన్ ను 160 డిగ్రీలలో పెట్టి 30 నుంచి 35 నిమిషాలపాటు దాన్ని బేక్ చేయాలి. టైం అయిపోయిన తర్వాత  తీసి ఓక్ ప్లేట్ లో పెట్టి కావాలనుకునే వాళ్ళు క్రీంతో గార్నిష్ చేసి కట్ చేసుకుని తినటమే. ఇందులో ప్రత్యేకంగా పంచదారను మనం కలపలేదు. ఎందుకంటే మిల్క్ మెయిడ్ లో ఉన్న తీపి సరిపోతుంది.

-కళ్యాణి