పెసలుతో పసందైన వంట

 


కావాల్సిన పదార్థలు

మొలకెత్తిన పెసలు            -   2 కప్పులు

టమాటో ముక్కలు            -   1 కప్పు

దోస లేక కీరా ముక్కలు      -   1 కప్పు

కొబ్బరి కోరు                     -   1 కప్పు

కొత్తిమీర                          -   త‌గినంత‌

పచ్చిమిర్చి                      -   1

ఉప్పు                              -   1 చెంచా

నిమ్మరసం                      -    2 కాయలవి

జీలకర్ర                            -   1 చెంచా

క్యారెట్ కోరు                     -   1/2 కప్పు

తయారుచేసేవిధానము

నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి వుంచాలి. ఇప్పుడు ఒక డిష్‌లో మొలకలు కొన్ని వేసి కొబ్బరి వేసి నిమ్మరసం, కొంచెం చల్లి మళ్లీ పైన మొలకలు వేయాలి. మళ్లీ కీర ముక్కలు వేసి నిమ్మరసం చల్లి పెసలు మొలకలు వేసి మరలా టమాటా ముక్కలు, నిమ్మరసం మరల క్యారెట్ కోరు, నిమ్మరసం, పెసల మొలకలు ఈ విధంగా వరసలు వరసలుగా వేసి ఒక అరగంట మూతపెట్టి వుంచాలి. ఆ తర్వాత వీటిని పుల్కాతో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.... రుచిగా కూడా వుంటాయి.