దాల్ షోర్బా

 

 

వర్షాకాలం వచ్చేసినట్టే. వర్షం పడుతుంటే అలా వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. లేదా కాఫీ లాంటివి కానీ.. సూప్స్ కానీ తాగాలనిపిస్తుంది. చల్లని వాతావరణంలో అలా వేడివేడిగా సూప్స్ తాగుతుంటే ఎంత బావుంటుంది.  ఈసారి దాల్ షోర్బా టేస్ట్ చేయండి.

కావలసిన పదార్ధాలు..

* ఎర్ర కందిపప్పు    - అరకిలో

* ఉల్లిపాయ         -   ఒకటి

* టమాటో           -   రెండు

* వెల్లుల్లి             -   రెండు రెబ్బలు

* అల్లంవెల్లుల్లి      -  టీ స్పూన్

* నెయ్యి              -   25 గ్రా

* పసుపు            -   అర చెంచా

* ఉప్పు               -   రుచికి సరిపడా

* క్రీమ్                -   3 స్పూన్స్

* కొత్తిమీర           -   కట్ట

తయారీ విధానం..

* ముందు ఒక బాణలిలో నీళ్లు పోసి.. కడిగిన కందిపప్పు అందులో వేసి మరిగించాలి.

* అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి, పసుపూ వేసి ఓ 20 నిమిషాలు మరిగించాలి.

* అలా మరిగిన పప్పును మెత్తగా రుబ్బి.. పలుచని బట్ట తీసుకొని అందులో వడగట్టాలి.

* వడగట్టిన మిశ్రమంలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరో 20 నిమిషాలు మరిగించాలి.

* ఇప్పుడు ఈ మిశ్రమంలో దోరగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. ఆఖరిగా నెయ్యి, ఉప్పు, కొత్తిమీర తురుము, క్రీమ్ వేసి వడ్డించాలి.