దాల్ మఖని

 

 

 

పంజాబీ రెసిపీస్ తినటానికి భలే రుచిగా ఉంటాయి కదా. మనం ఈ రోజు దాల్ మాఖని ఎలా తయారుచెయ్యాలో చూద్దాం. ఇది రోటిలోకి చాలా బాగుంటుంది. పొట్టు తీయని మినుములు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రెసిపి దానితోనే తయారుచేసుకోవచ్చు.

 

కావాల్సిన పదార్థాలు:

పొట్టు మినప  పప్పు - 1 కప్పు

రాజ్మా - 1/4 కప్పు

టమాటో ప్యూరి - 1/2 కప్పు

తరిగిన ఉల్లిముక్కలు - 1 కప్పు

వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్

ధనియాలపొడి - 1 స్పూన్

తాజా క్రీము - 2 స్పూన్స్

జీలకర్ర - 1/2 స్పూన్

ఉప్పు,కారం - తగినంత

 

తయారి విధానం:

తయారు చేయటానికి ముందు రోజు రాత్రి పొట్టు  మినపపప్పుని, రాజ్మా ని వేరు వేరుగా నానబెట్టుకోవాలి. మర్నాడు తయారుచేసే దాల్ మాఖని తయారుచేయటానికి  ముందుగా ఈ రెండిటిని కుక్కర్ లో ఉడికించాలి. వాటిని కాస్త మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక కడాయిలో వెన్న వేసి జీలకర్ర వెయ్యాలి. అది వేగాకా వెల్లుల్లి పేస్టు వేసి దానితో పాటు ఉలిముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. తరువాత టమాటో ప్యూరి వెయ్యాలి. అందులో ధనియాల పొడి, కారం, ఉప్పువేసి అన్ని కలిసి 2 నిమిషాలు మగ్గాకా ఉడికించి పెట్టుకున్న మినప పప్పు, రాజ్మా ని వేసి కలిపి పది నిముషాలు దగ్గరగా రానీయాలి. దానిలో తాజా క్రీము కలిపి కాసేపు ఉంచి దించెయ్యాలి. ఘుమఘుమలాడే దాల్ మాఖని రోటితో కలిపి తినటానికి రెడీ అయినట్టే.

 

..కళ్యాణి