కోకోనట్ రైస్

 

 

 

కావలసినవి:

కొబ్బరికాయ - ఒకటి 
బియ్యం - నాలుగు కప్పులు 
ఆవాలు - కొద్దిగా
జీలకర్ర - ఒక స్పూను
ఎండుమిరపకాయలు - ఐదు 
కరివేపాకు - నాలుగు రెబ్బలు 
శెనగపప్పు - ఒక కప్పు 
మినపపప్పు - చిన్న కప్పు 
ఉప్పు, నూనె - తగినంత
జీడిపప్పు - 4

 

తయారుచేసే విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మరుగుతున్న ఎసట్లో వెయ్యాలి. ఉడికిన తరువాత వార్చి మూతపెట్టాలి. తర్వాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసి స్టౌమీద పెట్టి వేడి అయిన తరువాత దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ఇలా వేయించిన పోపును ఉడికిన అన్నం మీద పోసి ఉంచాలి. తరువాత పచ్చికొబ్బరి తురిమి,పోవు ఉడికిన అన్నంలో కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి. పైన జీడిపప్పు చల్లుకోవాలి. అంతే కోకోనట్ రైస్ రెడీ.